చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలో రెండు ఇళ్లలో చోరీ
10తులాల బంగారం, రూ.40వేలు నగదు అపహరణ

చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలో రెండు ఇళ్లలో చోరీ
10తులాల బంగారం, రూ.40వేలు నగదు అపహరణ
చౌటుప్పల్. మన సాక్షి:
రెండిళ్లలో చోరీ అయిన సంఘటన చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సిఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం న్యూ విశ్వకర్మ కాలనీలో నివాసముంటున్న పెరికేటి నగేష్ చారి, కట్ట సుబ్రహ్మణ్యం కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
ALSO READ :
- Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
- Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
- Rains : వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ..!
- Viral : నీ ఏడుపు చల్లగుండ.. కళ్ళు పోయాలా ఏడ్చిండు..!
రోజు మాదిరిగానే వారు రాత్రి నిద్రపోయారు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని దొంగలు రెండిళ్లలో బంగారం, నగదును చోరీ చేశారు. శనివారం ఉదయం నిద్ర లేచి చూసుకోగా, చోరీ అయినట్లుగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. చౌటుప్పల్ ఏసిపి మొగులయ్య ఆధ్వర్యంలో నగేష్, సుబ్రహ్మణ్యంల ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
క్లూస్ టీం,డాగ్ స్వార్డ్ లతో వెతికించారు. నగేష్ ఇంట్లోని బీరువా నుంచి 10తులాల బంగారం, సుబ్రహ్మణ్యం ఇంట్లో కొంత వెండి, బంగారంతో పాటు రూ.40వేల నగదు గుర్తుతెలియని దొంగలు అపహరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేందర్ తెలిపారు.