Devarakonda : దేవరకొండ సాగు నీటి గోస తీరుస్తాం..!

దేవరకొండ నియోజకవర్గ సాగు నీటి గోస తీర్చడమే నా జీవిత లక్ష్యమని మాజీ సిఎల్పి నాయకులు కుందూర్ జానారెడ్డి అన్నారు. సోమవారం దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏ పల్లి, మల్లేపల్లి మండల కేంద్రా ల లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగాకార్నర్ పాయింట్ మీటింగు కు వార్ హాజరై సభకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడారు.

Devarakonda : దేవరకొండ సాగు నీటి గోస తీరుస్తాం..!

– సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి

కొండమల్లేపల్లి / చింతపల్లి, మనసాక్షి:

దేవరకొండ నియోజకవర్గ సాగు నీటి గోస తీర్చడమే నా జీవిత లక్ష్యమని మాజీ సిఎల్పి నాయకులు కుందూర్ జానారెడ్డి అన్నారు. సోమవారం దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏ పల్లి, మల్లేపల్లి మండల కేంద్రా ల లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగాకార్నర్ పాయింట్ మీటింగు కు వార్ హాజరై సభకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడారు.

దేవరకొండ ప్రాంత కన్నీటి గోసను ఆనాటి నుండి నేటి వరకు నేను చూస్తూనే ఉన్నానని, ఎస్ఎల్బీసీతో కొంత ప్రాంతం సాగవుతున్నదని, దేవరకొండ నియోజకవర్గ పూర్తిగా సాగు అయ్యేందుకు మనం ముందున్న లక్ష్యం ఒక్కటేనని, శ్రీశైల స్వరంగ మార్గం నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయించడమే నా జీవిత లక్ష్యం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పట్టుదలతోనే శ్రీశైల సొరంగ మార్గానికి నిధులు వెచ్చించి సుమారు 34 కిలోమీటర్ల స్వరంగా మార్గాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నాగార్జునసాగర్ లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కిదన్నారు.

మలిదశ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థుల బలిదానా లతో చెల్లించిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ గత పది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. డిండి నక్కల గండి ఎత్తిపోతల పథకాలకు నిధులు వెచ్చించకుండా స్వార్థంతో ఒక కాలేశ్వరం ప్రాజెక్టుకే నిధులు వెచ్చించి వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆ ప్రాజెక్టు మూడు నాళ్ళ ముచ్చటగానే మారిందన్నారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి దివాలా తీయించారని ఆరోపించారు.

ALSO READ : Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

తెలంగాణ రాష్ట్ర ప్రజలు బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు నాకిచ్చిన ఆశీర్వాదంతోనే నేను ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. మీ అందరి ఆదరాభిమానాలతో దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తన కుమారుడైన రఘువీర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మీకు అప్పజెప్తు న్నారన్నారు.

అందుకోసం నా పై నమ్మకం ఉంచి దేవరకొండ ప్రాంతా అభివృద్ధిని కాంక్షిస్తూ సాగునీటి సమస్య లక్ష సాధన కోసం ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అతనితో పని చేయించుకోవాలన్నారు.

అదేవిధంగా దేవరకొండ ప్రాంతాభివృద్ధికి ఇరువురు నాయకులు నా శిష్యుడు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, ఎంపీగా నా కుమారుడు రఘువీర్ రెడ్డి మీకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పీఏ పల్లి, మల్లేపల్లి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ హోదాల లో ఉన్న ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు, విద్యార్థి సంఘ నాయకుడు మహిళ మహిళ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ALSO READ : 

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

Nalgonda : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు.. పట్టభద్రుల ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

BIG Breaking : ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..!