విరాట్ విశ్వరూపం.. దుబాయ్ లో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు

విరాట్ విశ్వరూపం.. దుబాయ్ లో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు

(దుబాయ్ నుంచి మన సాక్షి ప్రతినిధి) అక్టోబర్ 23 (మన సాక్షి): ఆదివారం.. పైగా టి 20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మధ్య పోరు. ఇంకేముంది ‘అనంత’ ప్రజలు టీవీలకే అతుక్కుపోయారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితం తేలే దాకా అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఒకే ఆకాంక్ష. భారత్ గెలిచితీరాలని. సాయంత్రానికి ఇండియా విజయకేతనం ఎగురవేయడంతో దుబాయ్ లో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. పాకిస్థాన్ పై టీమిండియా గెలవటంతో దుబాయ్ లో భారత క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.  ఆదివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో దాయాది పాక్ పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో దుబాయ్ లో జనం రోడ్లపైకి వచ్చి డాన్సులు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని కేరింతలు కొట్టారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. డ్రమ్ములు వాయిస్తూ, అరుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.