Miryalaguda : మిర్యాలగూడలో హోటల్ యజమానిపై కత్తితో దాడి.. ముగ్గురి అరెస్ట్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ నందుగల ఉషారాణి హోటల్ పై దాడి చేసిన నిందితులను మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో హోటల్ యజమానిపై కత్తితో దాడి.. ముగ్గురి అరెస్ట్..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ నందుగల ఉషారాణి హోటల్ పై దాడి చేసిన నిందితులను మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం హోటల్ తీయగానే మిర్యాలగూకు చెందిన నలుగురు వ్యక్తులు మద్యం సేవించి పరోటా కావాలని వెళ్లారు. హోటల్ యజమాని వెంకటేశ్వర రావు కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు.

దీంతో అక్కడికి వచ్చిన వారు కూరగాయల కత్తితో యజమానిపై దాడి చేయగా తలకు తగిలి గాయమైంది.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకున్నారు. నిందితులైన నాగేళ్ల సురేష్, ఇలుగు ఏడుకొండలు, దామర రాంబాబు లను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

కేసు చేదించిన పోలీసులను ఎస్ఐలు రాంబాబు, కృష్ణయ్య, కానిస్టేబుల్స్ బాలకృష్ణ, కళ్యాణ్, రామకృష్ణ, అక్బర్ లను సిఐ అభినందించారు

ALSO READ :

Electricity Bill : మీ కరెంట్ బిల్లు ఈజీగా ఇలా చెల్లించండి.. మొబైల్ తోనే చెల్లించవచ్చు..!

BREAKING : సినీ ఫక్కీలో చేజింగ్.. నార్కట్ పల్లి నుంచి దొంగలను వెంబడించిన పోలీసులు,.!

KCR : హలో.. ఫామ్ హౌస్ కు రండి, డైలమాలో గులాబి దళపతి..!