Ap News : ఆగని వలంటీర్ల రాజీనామాలు..!

ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయపార్టీలు నిందలు మోపడం బాధ కలిగించిందని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని 17వ వార్డుకు చెందిన 14 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కే.ప్రమీల విధి నిర్వహణలో భాగంగా అందుబాటులో లేకపోవడంతో, వార్డు వలంటీర్ల ఇన్‌చార్జ్‌ సహదేవకు రాజీనామా పత్రాలను అందజేశారు.

Ap News : ఆగని వలంటీర్ల రాజీనామాలు..!

మదనపల్లె టౌన్, మనసాక్షి : .

ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయపార్టీలు నిందలు మోపడం బాధ కలిగించిందని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని 17వ వార్డుకు చెందిన 14 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కే.ప్రమీల విధి నిర్వహణలో భాగంగా అందుబాటులో లేకపోవడంతో, వార్డు వలంటీర్ల ఇన్‌చార్జ్‌ సహదేవకు రాజీనామా పత్రాలను అందజేశారు.

 

చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వలంటీర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… గత 50 నెలలుగా లబ్దిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందజేసి, నిస్వార్థసేవలు చేశామన్నారు. ఎలాంటి రాజకీయాలకు ప్రభావితంగా కాకుండా, ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయపార్టీలు నిందలు వేస్తున్నాయన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర నుంచి మొబైల్‌ సిమ్స్, డివైస్‌లు తీసేసుకున్నారని చెప్పారు. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నామని, తాము ఎవరిదగ్గర డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

 

తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఏప్రిల్‌ మొదటి, రెండోరోజు ఉదయం నుంచి తమకు వృద్ధులు, దివ్యాంగులు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఎందుకు ఇవ్వలేదని చెపుతుంటే, సమాధానం చెప్పలేకపోయామన్నారు. సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి, సమాజంలో గౌరవం కల్పించి, తమకు గుర్తింపును తెచ్చారన్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే, ప్రజలకు మరింత మెరుగైన పథకాలు తీసుకురావడమే కాకుండా పేదలు సగర్వంగా తలెత్తుకుని జీవిస్తారన్నారు.

 

రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్‌అహ్మద్‌ గెలుపుకు కృషిచేస్తామన్నారు. 17వవార్డు నుంచి వలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన వారిలో…మహమ్మద్‌ ఫారుఖ్, ఎస్‌.కే.ముజాంబిల్, ఎస్‌.మైనుద్ధీన్, ఎస్‌.యూనస్, ఎస్‌.ముజాహిద్, తబ్రేజ్‌బాషా, ఖాదర్‌వలీ, ఎం.సుమియాకౌసర్, పి.కరిష్మా, పి.కశ్మీరా, హమిదా, కే.మౌనిక, ఎస్‌.యాసీన్‌భాను, ఎస్‌.తహసీన్‌భాను తదితరులు ఉన్నారు.

ALSO READ : 

TDP : టీడీపీలో ఐవీఆర్‌ఎస్‌ రగడ..!

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!