Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

Sand : ఇసుక లారీలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు..!

Sand : ఇసుక లారీలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు..!

రోజుకొకరు మృతి పట్టించుకోని పాలకులు

మంగపేట, మన సాక్షి ప్రతినిధి

ఇసుక లారీలతో జాతీయ రహదారుల నెత్తురోడుతున్నాయి రోజుకొకరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. ఆయన అధికారులతో ఏమాత్రం చలనా లేదు రెవెన్యూ అడవి శాఖ అధికారులు కనీసం చీమకుట్టినట్లు కూడా కనిపించడం లేదు. మంగపేట వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం మండలం నుండి నిత్య వందల లారీలు నుండి ఇసుక క్వారీల నుండి వరంగల్ హైదరాబాద్ ప్రాంతాలకు ఇసుకలోడుతో వెళ్తుంటాయి.

కాళీ లారీలు కూడా నింపుకోవడానికి ఇదే జాతీయ రహదారిపై వస్తూ ఉంటాయి కాగా ఇసుక లారీలతో జాతీయ రహదారులన్నీ చిద్రంగా మారాయి రోడ్లన్నీ గుంతలుగా ఏర్పడి నిత్య ప్రమాదాలు కొనసాగుతున్నాయి. కార్లలో పయనించే వారికి కూడా ప్రమాదాలు తప్పడం లేదు బాటసారిలకు. ద్విచక్ర వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని రహదారిపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక సాయంత్రం అయితే ఇసుక లారీ డ్రైవర్ల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది సాయంత్రం 6 దాటితే ఇసుక క్వారీల్లో ఇసుక లోడింగ్ ని నిలిపివేయాలి కానీ ఇసుక క్వారీ నిర్వాహకులు. అడవి శాఖ రెవెన్యూ శాఖ అధికారుల ఆశీస్సులు ఉండడంతో అర్ధరాత్రి కూడా లోడింగ్ జరుగుతుందని సమాచార ఇంక లారీ డ్రైవర్ల కొన్నిచోట్ల ఆగి మద్యం సేవించి రహదారిపై ఇషానుసారంగా నడుపుతున్న పరిస్థితిలకు ఉంది.

దీంతో రోడ్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఈనెల రోజుల్లోనే అనేకమంది రోడ్ల ప్రమాదాలతో ఇసుక లారీలు ఢీకొని చనిపోయిన సంఘటన ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నెల 2, గురువారం రోజున ఇసుక లారీ డీకొని బందెల సాంబయ్య అనే ఫోటోగ్రాఫర్ మృతి చెందిన సంఘటన ఏటూరునాగారం ప్రాంతంలో జీడీవాగు వద్ద చోటు చేసుకుంది కాని పాలకులు అధికారులు ఎలాంటి పట్టింపులు లేదు దింతో ప్రజలు పాలకులు నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ప్రాణాలు పోకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన ద్విచక్ర వాహనదారున్ని మంగపేట మండలం కమలాపురం కు చెందిన గుగ్గిళ్ళ రమేష్ గా గుర్తించారు. జరిగిన ప్రమాదం తీరుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

రహదారికి ఇరువైపులా ఇసుక లారీలు నిలపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇసుక లారీలను అధికారులు నియంత్రించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గుసగుసలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా హైవే రహదారికి ఇరువైపులా లారీలను నిల్పకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను వేడుకుంటున్నారు.

ALSO READ : 

IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

మరిన్ని వార్తలు