Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!

Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!

హైదరాబాద్, మన సాక్షి :

రైతుబంధు పథకంపై ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సహాయం జూన్ 26వ తేదీ నుంచి వారి వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అందుకుగాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసింది. వానకాలం సీజన్ లో 5000 రూపాయలు యాసంగి సీజన్ లో 5000 రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తుంది.

 

ఎక్కువ మంది చదివిన వార్తలు … మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

🔥 Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

🔥 Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!

🔥 RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

🔥 PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!

🔥 Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!

 

గత ఏడాది ఇదే సీజన్ లో 68 .94 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా సహాయం అందించింది. 1.53 కోట్ల ఎకరాలకు 7,654 . 43 కోట్ల రూపాయల సహాయం అందజేసింది. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు 58,102 కోట్ల రూపాయల సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించింది.

 

కొత్త వారికి గుడ్ న్యూస్:

రైతులు కొత్తగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములకు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2023 జూన్‌ 16వ తేదీ లోపు వ్యవసాయ భూమి కొత్తగా రిజిస్టేషన్‌ చేయించుకున్న రైతుల నుండి అధికారులు రైతుబంధు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

 

రైతులు గ్రామాల ఏ ఈ ఓల వద్ద రైతుబంధు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వారికి పట్టాదారు పాస్ పుస్తకం తో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అందజేసి దరఖాస్తు చేసుకోవాల్సింది. వ్యవసాయ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు కూడా సూచించారు.

 

మరిన్ని వార్తలు