ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ
ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ
దమ్మపేట , మనసాక్షి
దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల పి డి కుర్సం నాగేంద్రమ్మ ఈ నెల హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో రాష్ట్ర స్థాయి లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయి లో పంజాబ్ రాష్ట్రం చండీఘర్ లో జరిగే పోటీలకు ఎంపిక అయినారు .
ఈ సందర్భంగా ఆమెను ఈ రోజు పాఠశాల లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తొలేం వెంకటేశ్వర్లుమాట్లాడుతూ మన రాష్ట్రంలోనేఅంకంపాలెం బాలికల సాధించటం గర్వకారణంగా ఉందని తెలిపారు.పట్టుదల ఖుషి అనే రెండు అంశాలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు.
వార్డెన్ సౌజన్య , ఉపాధ్యాయులు రమణ , కాంతమ్మ, కృష్ణ ప్రసాద్ , రామకృష్ణ , వీరభద్రమ్ ,రవి , శ్రీను గోపాలరావు లత వాణి దేవి , రజని , సత్యవతి ,రమేష్ , రవిశంకర్ , కృష్ణ చరణ్ , నాగమణి కుమారి , తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









