Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన ఆణిముత్యాలు..!

పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో... నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

Miryalaguda : ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన ఆణిముత్యాలు..!

పది పరీక్ష ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం

– ఇంగ్లీష్ మీడియంలో ప్రధమ ర్యాంక్ సాధించిన చిట్యాల శివ

– తెలుగు మీడియంలో త్రివేణి ప్రధమ ర్యాంక్

మన సాక్షి:

పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో… నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న చిట్యాల శివ 557/600 ప్రధమ ర్యాంక్, సందరబోయిన స్వాతి 551/600 ద్వితీయ ర్యాంక్,నక్క తేజశ్రీ 524/600 తృతీయ ర్యాంక్ సాధించారు.

తెలుగు మీడియం విభాగంలో త్రివేణి 538/600 ప్రధమ ర్యాంక్, అనూష 506 ద్వితీయ ర్యాంక్ , పి.లోకేష్ 492 తృతీయ ర్యాంక్ సాధించగా… నేహా పర్వీన్ 518, వినయ్ 516,శీలం పావని 512, అనంతుల శ్రీజ 504, కత్తుల ప్రసన్న కుమారి 504, జి. సిద్దు 504 మార్కులతో విద్యార్థులు ప్రతిభ సాధించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఎంజీఓ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు అభినందనలు తెలిపారు.

By : Vinay goud, Miryalaguda

ALSO READ : 

మరిన్ని వార్తలు