Hand Writing Family : చేతిరాత కుటుంబం

రెండు దశాబ్దాల ప్రస్థానం,  అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమి

Hand Writing Family : చేతిరాత కుటుంబం

రెండు దశాబ్దాల ప్రస్థానం,  అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమి

సూర్యాపేట , మనసాక్షి

గత రెండు దశాబ్దాలుగా పలు తెలంగాణ స్కూళ్లలో వేలాది మంది విద్యార్థులకు, వందలాదిమంది ఉపాధ్యాయులకి చక్కని చేతిరాత అంశంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన జర్నలిస్ట్ ,కార్టూనిస్ట్ , అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ పల్లె మణిబాబు ఆధ్వర్యంలో సూర్యాపేటలోని పలు పాఠశాలలో వేసవి చేతిరాత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు .

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకి ఉచితంగా, పేద మధ్యతరగతి వారికి ప్రత్యేక రాయితీతో ఆయన తన శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తుండటంతో పలువురు విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుండటం విశేషం.ఇంగ్లీషుకు సంబంధించి ఆర్డినరీ ,కర్సివ్ ,లుసిడ మరియు చక్కని తెలుగు, స్పీడ్ రైటింగ్, ఆర్టిస్ట్ రైటింగ్, పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ తదితర విభాగాల్లో విద్యార్థుల తరగతి, మానసిక పరిణతి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తన తరగతుల నిర్వహిస్తూ విద్యార్థుల చేతిరాతల్ని చక్కగా తీర్చిదిద్దుతుండటం విశేషం.

సూర్యాపేట పట్టణంలోని బాలాజీ నగర్ ,శ్రీరామ్ నగర్ ,విద్యానగర్ ,60 పిట్ల రోడ్డు ,నెహ్రు నగర్ , శ్రీ శ్రీ నగర్ ప్రాంతాలలో వివిధ పాఠశాలల్లో ఆయన నిర్వహిస్తున్న చేతిరాత శిక్షణ కార్యక్రమాల్లో 200 విద్యార్థులు శిక్షణ పొందుతుండటం గమన హారం .

 

ఈ రంగంలో ఇప్పటికే ఇతోదిక కృషి చేసి తన పరిశోధనల సారంతో ఏడు పుస్తకాలను ప్రచురించిన అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ పల్లె మణి బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొద్దిపాటి జాగ్రత్తలు ,సూచనలు పాటిస్తూ పిల్లల చేతిరాతల్ని సక్రమంగా ఉంచితే పిల్లలు వ్యక్తిత్వ పరంగా, క్రమశిక్షణ పరంగా సానుకూల దృక్పథంతో వికసించే అవకాశం ఉంది అన్నారు .

 

పొందికైనా అక్షరాలను కూర్చి రాసే పిల్లల్లో జీవితాన్ని కూడా పొందికగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు .బోధనా రంగంలో ఉన్నవారు ముందు వారి చేతిరాతల్ని సరిదిద్దుకోలేక పోతే రానున్న తరాలకి చెడ్డ చేతిరాతల్ని వారసత్వంగా ఇచ్చిన వారు అవుతారని ఆయన సూచించారు.

 

విద్యార్థులకు చేతిరాత శిక్షణ అందించే కార్యక్రమంలో డైరెక్టర్ మణి బాబుతో పాటు ఆయన భార్య హేమ , కూతురు అక్షర కూడా కృషి చేస్తూ మొత్తం కుటుంబమే హ్యాండ్ రైటింగ్ కుటుంబంగా ఉండటం విశేషం .ప్రతిభావంతమైన పేద విద్యార్థులకు ఉచితంగా చేతిరాత శిక్షణ అందించే వీరు తమ సెల్ నెంబర్ 960 3324206 మరియు 944 1164317 నెంబర్లలో సంప్రదించవచ్చని వారు తెలిపారు .

CLICK HERE READ ME :

  1. MODEL COLLEGE : మోడల్ కాలేజిలో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం
  2. Treditional Bed : నులక మంచానికి అంతరేటా..? వార్నీ.. ఎందుకో..?
  3. Ts rtc : ఆర్టీసీలో విలేజ్ బస్ ఆఫీసర్లు… కొత్తగా నియామకం
  4. మిర్యాలగూడ : బైక్ లో రైతు సొమ్ము దొంగిలించిన వ్యక్తి .. ఫోటో విడుదల చేసిన పోలీసులు.. !
  5. కర్ణాటక : కాంగ్రెస్ కు విజయం చేకూర్చింది తెలుగు తమిళీయులేనా..?.. తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్..!
  6. Alert : ఆ నెంబర్ల నుంచి .. వాట్సాప్  కాల్స్ వస్తే.. ఏం చేయాలి..?
  7. Whatsapp Gas Booking : వాట్సప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఈజీ.. ఎలానో తెలుసుకుందాం ..!