రెండో రోజుకు చేరిన పాత్రికేయుల రిలే నిరాహారదీక్షలు

రెండో రోజుకు చేరిన పాత్రికేయుల రిలే నిరాహారదీక్షలు

శ్రీ సత్య సాయి జిల్లా, ఓబుల దేవర చెరువు , మన సాక్షి :

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలు చేస్తున్న పాత్రికేయులకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపి దీక్ష శిబిరంలో కూర్చున్నారు.

 

ప్రభుత్వం స్పందించాలి పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి అంజి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో తమదైన పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిన్న చూపు చూడడం మంచిది కాదన్నారు.

 

ALSO READ : 

1.CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

2. After 23 years : 23 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

3. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

4. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

 

ఏళ్ల తరబడిగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ పాత్రికేయులు ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి వారికి నివేశ స్థలాలతోపాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డివిజన్ కార్యదర్శి అంజి, చలపతి, రత్నా భాయ్ పాల్గొన్నారు.