Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యం

Suryapet : మా పల్లె డాక్టర్ ని పంపించండి..!

Suryapet : మా పల్లె డాక్టర్ ని పంపించండి..!

పెన్ పహాడ్, మన సాక్షి:

మా పల్లె డాక్టర్ను మా పల్లెకి పంపించండి అని మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన ప్రజలు సూర్యాపేట జిల్లా ఉప వైద్యాధికారి కోటి రత్నం కు ఫిర్యాదు చేసినారు. అసలు వివరాలలోకి వెళితే..

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం పల్లె దోవకానాల గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ కొనకంచి హరి ప్రసాద్ ను గత కొన్ని నెలలుగా సదరు డాక్టర్ను గ్రామ ప్రజలు పాలకుల తీర్మానం లేకుండా సూర్యాపేటలోని రాజీవ్ నగర్ దావఖానకు పై అధికారుల పైరవీతో పంపించినారు.

అప్పటినుంచి నేటి వరకు అనంతారం పల్లె దోవకానాకి డాక్టర్ లేకపోవడంతో గ్రామ ప్రజలు అనేక రోగాల బారిన పడి సూర్యాపేట పట్టణం లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అధిక మొత్తంలో వైద్యం కోసం డబ్బులు ఖర్చు కావడంతో అప్పుల పాలవుతున్నారని డిప్యూటీ డిఎంహెచ్వో కు వివరించినారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మా గ్రామ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా కాపాడి మా గ్రామ ప్రజల కు వైద్యం అందించే డాక్టర్ హరి ప్రసాద్ ను మా పల్లె దోవకానాకి పంపించాలని అసలు పోస్టింగ్ అనం తారం పల్లె దోవకానాలోని ఉన్నదని కొంతమంది పైరవీల ద్వారా సూర్యాపేట రాజీవ్ నగర్ కు ఇక్కడి డాక్టర్ను పంపించడం చాలా అన్యాయమని అనంతరం గ్రామ ప్రజలు డిప్యూటీ డిఎంహెచ్ఓ కు ఫిర్యాదు చేసినారు.

గ్రామానికి చెందిన యువ నాయకులు జింకల నాగార్జున, మామిడి అంబేద్కర్, జగదీష్ వారు మాట్లాడుతూ మా పల్లె దోవకానాలు పనిచేస్తున్న డాక్టర్ హరిప్రసాద్ ను డిప్యూటేషన్ పై పంపించడం చాలా అన్యాయమని ఇప్పటికైనా మా పల్లె దోవకానాకి డాక్టర్ కొనకంచి హరిప్రసాద్ ను తిరిగి పంపించాలని లేనియెడల వచ్చే వేసవి కాలంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదని వారన్నారు.

మా పల్లె దావకానకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు పడుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియపరచాలని వారు కోరినారు డిప్యూటీ డిఎంహెచ్వో కు ఫిర్యాదు చేసిన వారిలో శ్రీను, రాజబాబు, రమేష్, వెంకటేశం , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Fertilizer : ఎరువుల డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. గోదాములలో ఎరువుల నిల్వల తనిఖీ..!

  2. Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!

  3. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

  4. Nalgonda : వన మహోత్సవం లక్ష్యం 68 లక్షల 70 వేల మొక్కలు..!

  5. కలెక్టర్ సారూ.. మా గోస ఆలకించండి..!

మరిన్ని వార్తలు