సూర్యాపేట : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
శ్రీ సాయి త్రివేణి డిగ్రీ పీజీ కాలేజ్ కరస్పాండెంట్ పెసర జనార్దన్ రెడ్డి

సూర్యాపేట : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
శ్రీ సాయి త్రివేణి డిగ్రీ పీజీ కాలేజ్ కరస్పాండెంట్ పెసర జనార్దన్ రెడ్డి
సూర్యాపేట, మనసాక్షి :
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేలా కష్టపడి చదవాలని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ పీజీ కాలేజ్ కరస్పాండెంట్ పెసర జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ పీజీ కాలేజీలో ఇటీవల విడుదలైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల్లో కళాశాలకు చెందిన గుణగంటి ఉమా ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్, వీరబోయిన మహేష్ ఎంపీసీ థర్డ్ ఇయర్ పదికి పది జిపిఏ మార్కులు సాధించగా వారిని సన్మానించి మాట్లాడారు.
విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను సాధించేలా జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. విద్యార్థులు సమాజాభివృద్ధికి తోడ్పడడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు .శ్రీ సాయి త్రివేణి డిగ్రీ పీజీ కాలేజ్ విద్యార్థులు సూర్యాపేట జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ తన్నీరు ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు విజయం సాధించేందుకు విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు .
ALSO READ :
- ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ
- మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
- TELANGANA : బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
- మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!
గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సాయి త్రివేణి డిగ్రీ పీజీ కాలేజ్ అనేక ర్యాంకులను సాధించడంతోపాటు రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుందన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు వింటూ మరిన్ని ర్యాంకులు వచ్చేలా కష్టపడి చదవాలని తెలిపారు. కళాశాల డైరెక్టర్ అనిల్ కుమార్, అధ్యాపకులు శీను, రవళి, సంతోషి, నాగలింగం, ఎం శ్రీను ,సతీష్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,ఎండి హుస్సేన్, వీరన్న, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
MOST READ :
- మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్
- TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
- Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
- Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!
- TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
- ప్రాణం ఖరీదు ఒక లక్ష యాభై వేలు..!