Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Polling : రబ్బర్ బుల్లెట్లు, రాళ్లదాడుల నడుమ.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్..!

Polling : రబ్బర్ బుల్లెట్లు, రాళ్లదాడుల నడుమ.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్..!

మన సాక్షి , పొలిటికల్ బ్యూరో :

తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ విడత పార్లమెంటు పోలింగ్ ముగిసింది. తెలంగాణలో పార్లమెంట్ పోలింగ్ ముగియగా ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటు శాసనసభ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. తెలంగాణలో ఒకటి, రెండు చిన్న వివాదాలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏపీలో మాత్రం అనేకచోట్ల పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పై టిడిపి వర్గీయులు రాళ్ల దాడి చేయడంతో టిడిపి కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ క్రమంలో రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు.

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం బెట్టి పాలెం పోలింగ్ కేంద్రంలో వివాదం జరిగి టిడిపి కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దాంతో బెట్టి పాలెంలో ఐదు గంటలకే పోలింగ్ నిలిచిపోయింది. బాపట్లలో గవినివారి పాలెం లో టిడిపి వైసిపి కార్యకర్తలు నడుమ ఘర్షణ జరిగింది. టిడిపి అభ్యర్థి కొండయ్య వాహనంపై రాళ్లదాడి చేశారు. దాంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇక్కడ టిడిపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు.

తెలంగాణలోని హైదరాబాదులో గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళ్ హాట్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

6 గంటలకు ముగిసిన పోలింగ్ :

తెలుగు రాష్ట్రాలలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో సమస్య ఆత్మకప్రాంతాలైన 14 పోలింగ్ కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసింది.

తెలంగాణలో సాయంత్రం 6 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదయింది. జహీరాబాద్ 63. 96 అత్యధికంగా పోలింగ్ కాగా హైదరాబాదులో 29.47% అత్యల్పంగా పోలింగ్ నమోదయింది. ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 6 గంటలకు 75% పోలింగ్ నమోదు కాగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74% అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 55 శాతం పోలింగ్ నమోదయింది. పోలింగ్ బూత్ లోకి వచ్చిన వారందరికీ ఓటు హక్కు కల్పించడం వల్ల మరికొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.

ALSO READ : 

Telangana : ఓటు వేసేందుకు స్వగ్రామం వెళ్ళిన కేసీఆర్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..?

Telangana : కొడంగల్ లో రేవంత్ రెడ్డి.. చింతమడకలో కేసీఆర్..!

BREAKING : కేంద్రంలో అధికార మార్పిడి ఖాయం..!

Nalgonda : క్యూలో నిల్చోని నల్గొండ జిల్లా కలెక్టర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

 

మరిన్ని వార్తలు